RRR Collections : బాహుబలి 2 రికార్డును బద్దలుకొట్టిన RRR

RRR Collections : బాహుబలి 2 రికార్డును  బద్దలుకొట్టిన  RRR
RRR Collections : టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌‌లో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

RRR Collections : వరల్డ్ వైడ్‌‌గా ఇప్పుడు RRR మేనియా మొదలైంది. టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌‌లో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా కనిపించాడు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ రిపోర్ట్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లలలో అల్ టైం రికార్డు సృష్టించింది.

అమెరికాలో ప్రిమియర్స్ తో పాటు తొలిరోజు కలెక్షన్లు 5 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసింది. దీనితో బాహుబలి 2 (4.59 మిలియన్లు)ని బ్రేక్ చేసింది. ఇక ఏపీతెలంగాణలో ఒక్కరోజే రూ. 70కోట్లు రాబట్టింది. ఇప్పటికి ఇదే అల్ టైం రికార్డు కావడం విశేషం. ఇక రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story