RRR Release Date: ఆ సినిమాలకు పోటీగా ఆర్‌ఆర్‌ఆర్..

RRR Release Date: కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టారర్‌పై ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలే ఉన్నాయి. అందుకే దీని విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్న సమయానికి ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ మొదలయ్యేవి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేస్తూ ప్రకటన ఇచ్చింది మూవీ టీమ్.
ముందుగా 2020 జులై30న ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీని ప్రకటించింది. అప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. కానీ ఆ సంవత్సరం దాదాపుగా లాక్‌డౌన్ ఉండడంతో కనీసం షూటింగ్‌ను కూడా జరిపే పరిస్థితి లేకపోయింది. అన్నీ మామూలు పరిస్థితికి వచ్చిన తర్వాత విడుదలను ఒక సంవత్సరం వాయిదా వేస్తూ 2021 జనవరి8న విడుదల అంటూ అనౌన్స్ చేసింది. అదీ కాకుండా తాజాగా అక్టోబర్ 13న విడుదల అన్నారు. ప్రస్తుతం అది కూడా కుదరక పోవడంతో ఆర్ ఆర్ ఆర్ కొత్త విడుదల తేదీతో మన ముందుకు వచ్చింది.
2022 జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్నట్టు మూవీ టీమ్ రిలీజ్ పోస్టర్ విడుదల చేసింది. అంటే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు రానున్నారన్నమాట. కాకపోతే ఇప్పటికే సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. జనవరి 12న భీమ్లా నాయక్, జనవరి 13న సర్కారు వారి పాట, జనవరి 14న రాధే శ్యామ్ వరుసగా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. మరి వీటిలో సంక్రాంతి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచేది ఏదో..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com