RRR Soul Anthem: మనసును హత్తుకునే 'జనని'..

janani song RRR (tv5news.in)
RRR Soul Anthem: రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ గురించే. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు. దానికి తగినట్టుగానే రాజమౌళి కూడా ప్రమోషన్స్‌లో ఆచితూచి అడుగులేస్తున్నాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి 'జనని' పాట విడుదలయ్యింది.
స్వాతంత్ర్యం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కథను రాజమౌళి సస్పెన్స్‌లో పెట్టినా కూడా ఎన్‌టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్ల గురించి.. సినిమా బ్యాక్ స్టోరీ గురించి మాత్రం బయటపెట్టేశాడు జక్కన్న. అప్పటినుండి అసలు స్టోరీ ఏంటా అని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలయ్యింది. అంతే కాక పాటలతో కూడా ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.
'జనని' పాట ఆర్ఆర్ఆర్‌కే ప్రాణం లాంటిది అని మూవీ టీమ్ ఇప్పటికీ చెప్పకనే చెప్పింది. దానికి తగినట్టుగానే స్లోగా, ఎమోషలనల్‌గా సాగే పాటలాగా ఉంది జనని. గ్లింప్స్‌లో చూడిన మరికొన్ని సీన్లు జనని పాటలో యాడ్ చేశారు. ఇందులో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ నటనలోని ఇంటెన్సిటీ చూస్తుంటే ఇద్దరు పోటీపడి నటిస్తున్నారని అర్థమవుతోంది. రిలీజ్ అయిన కాసేపటికే జనని సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com