Jr. NTR: RRR స్టార్ ఆస్కార్ విజేతకు అభిమానుల ఘన స్వాగతం..

Jr.NTR: RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ 2023 విజయం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం చెప్పారు. విమానాశ్రయంలో గుమికూడిన విలేకరులు, ఫొటోగ్రాఫర్‌లను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగించారు. ఆదివారం నాడు హాలీవుడ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఆస్కార్ 2023 వేడుకకు హాజరైన తర్వాత RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్ భారతదేశానికి తిరిగి వచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ కెమెరా కంటికి చిక్కారు. 95వ అకాడమీ అవార్డుల వేడుకల్లో RRR చిత్రంలోని పాట “నాటు నాటు” ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తరువాత, అతని భార్య లక్ష్మీ ప్రణతి అతన్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. నటుడు తన కారుపై నిలబడి, అతనికి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో విష్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com