Ram Charan: చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. హాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న RRR స్టార్

Ram Charan: RRR స్టార్ రామ్ చరణ్ త్వరలో హాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నాడు.రామ్ చరణ్ తన హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి 'కొద్ది నెలల్లో' అధికారిక ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నాడు. ఇది కాకుండా, జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చరణ్ తెలిపాడు. RRR నటుడిని 'గ్లోబల్ స్టార్'గా చూడాలని ఎదురుచూస్తున్న రామ్ చరణ్ అభిమానులకు ఈ వార్త నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డేవిడ్ పోలాండ్ హోస్ట్ చేసిన DP/30 సిరీస్‌లో చరణ్ కనిపించి, “ఎవరు హాలీవుడ్ నటుడిగా ఉండాలనుకోరు?” అని చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
“ప్రపంచం అంతా ఒక్కటి అవుతోంది. సినిమా కూడా 'గ్లోబల్ సినిమా' అని పిలవబడుతుందని నేను భావిస్తున్నాను. ఇకపై హాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఏదీ సెపరేట్‌గా ఉండదు. ఎవరైనా, ఎప్పుడైనా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. వారి ప్రతిభ వారిని ప్రపంచ స్థాయిలో నిలబెడుతుంది. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ 2023కి ముందు తన చిత్రం RRR ప్రమోషన్ కోసం USలో ఉన్నారు. ఈ చిత్రం యొక్క నాటు నాటు ఉత్తమ పాటల విభాగంలో ఆస్కార్స్ 2023కి నామినేట్ చేయబడింది. చరణ్ ఇటీవల రెండు ప్రసిద్ధ హాలీవుడ్ టాక్ షోలలో కనిపించాడు - గుడ్ మార్నింగ్ అమెరికా మరియు KLTA ఎంటర్టైన్మెంట్‌లో RRR చిత్ర విశేషాలు పంచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com