Shriya Saran : కథ వినకుండానే సైన్ చేశా.. RRRలో ఎన్టీఆర్, చరణ్ హీరోలని తెలియదు : శ్రియ

Shriya Saran : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR).. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది ఈ చిత్రం. అయితే ఈ మూవీ పైన షాకింగ్ కామెంట్స్ చేసింది సీనియర్ హీరోయిన్ శ్రియ..
RRR కథ వినకుండానే సినిమాకి సైన్ చేశానని, రాజమౌళి సినిమా అనగానే ఏం ఆలోచించలేదని అంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారని తెలుసు కానీ వాళ్ళు ఎన్టీఆర్, చరణ్ లని తెలియదని శ్రియ చెప్పుకొచ్చింది. షూటింగ్ మొదలయ్యాక ఈ విషయం తెలిసిందని తెలిపింది. ఇలాంటి ఓ గొప్ప చిత్రంలో తనకి ఓ మంచి పాత్ర ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాక్స్ చెప్పింది శ్రియ.
ఇంకా తాను సినిమా చూడలేదని, సినిమా రిలీజైన టైంలో తాను ముంబైలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అక్కడ టిక్కెట్లు దొరకలేదని, ప్రతి థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులేనని తెలిపింది. ప్రస్తుతం షూటింగ్ కోసం బెంగళూరు వచ్చానని, ఇక్కడ కూడా టిక్కెట్లు దొరకడం లేదని పేర్కొంది. కనీసం వచ్చే వారమైనా టిక్కెట్లు దొరుకుతాయేమో చూడాలని చెప్పుకొచ్చింది.
కాగా గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com