RRR: స్టోరీ రివీల్.. వాళ్లిద్దరు కొట్టుకుంటుంటే కన్నీళ్లు: విజయేంద్రప్రసాద్

RRR: స్టోరీ రివీల్.. వాళ్లిద్దరు కొట్టుకుంటుంటే కన్నీళ్లు: విజయేంద్రప్రసాద్
RRR: అన్నిటికంటే ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి ఇచ్చిన ఇంటర్వ్యూ హైలెట్ గా నిలిచింది.

RRR: హమ్మయ్య ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చేసింది. ఈ ఒక్కరాత్రి వెయిట్ చేస్తే చాలు.. అసలే ఎండ వేడిమికి బయట ఉక్కపోతగా ఉంటే.. టిక్కెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియక ఫోన్లు పట్టుకుని అనుక్షణం టికెట్ కోసం అన్వేషిస్తోంది యూత్.

రెప్పపాటు కాలంలో టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి.. ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహపడిపోతున్నారు.. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నారు.. ఒక్క టిక్కెట్.. ఒక్క టిక్కెట్ అంటూ వంద సార్లు ప్రయత్నిస్తున్నారు.. ఇదంతా ఫస్ట్ డే అరుపులు, కేకల మధ్య సినిమా చూసి ఆనందించడానికి.

వారం పది రోజుల నుంచి ఏదో ఒక వేదికమీద ప్రమోషన్లు ఇస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్. ప్రేక్షకుల్లో అప్పుడే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది ఆర్. అన్నిటికంటే ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి ఇచ్చిన ఇంటర్వ్యూ హైలెట్ గా నిలిచింది. ఆయనే కొడుకు చిత్రాలకి సంభాషణలు రాస్తుంటారు.

రాజమౌళి సినిమాలో ఎంత విజువల్స్ చొప్పించినా అవి కూడా కథలో అంతర్లీనంగా ఉండి ప్రేక్షకుల చేత ఔరా అనిపిస్తాయి. ఇప్పటికే బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో తన స్థానాన్ని పదిలం చేసుకోనున్నారు.

ఇక విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతులు సినిమాపై ఉన్న క్యూరియాసిటీని అమాంతం పెంచేశాయి. ఈ కథలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రాణమిత్రులుగా కనిపిస్తారు. కానీ వారి ఐడియాలజీ వేరుగా ఉంటుంది. భిన్న ధృవాలున్న ఇద్దరు వ్యక్తులు స్టోరీలోకి ఎంటర్ అయ్యాక క్లాష్ రాకుండా ఉంటే బావుంటుంది అనే ఫీలింగ్ తెప్పిస్తూ కథ సాగుతుంది అని చెప్పారు.

ఇక ఇంటర్వెల్లో సీన్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది అని తెలిపారు విజయేంద్ర ప్రసాద్. ఇద్దరూ సింహాల్లా కొట్టుకుంటున్న ఆ సీన్ చూసి తనకైతే ఏడుపు వచ్చిందని చిత్రంలోని హైలెట్ పాయింట్ రివీల్ చేశారు.

ఇప్పటికి ఐదు సార్లు రష్ చూశానని, చూసిన ప్రతి సారి కళ్ల వెంట నీళ్లు వచ్చాయని అన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అల్లూరి సీతారామ రాజుగా, కొమరం భీమ్ గా కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story