RRR Collection: ఆ హాలీవుడ్ సినిమా కలెక్షన్స్‌ను బీట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'..

RRR Collection: ఆ హాలీవుడ్ సినిమా కలెక్షన్స్‌ను బీట్ చేసిన ఆర్ఆర్ఆర్..
RRR Collection: ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' రూ. 500 కోట్లు కలెక్ట్ చేసి రూ.700 కోట్ల మార్క్‌ను టచ్ చేయడానికి దగ్గరగా ఉంది.

RRR Collection: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. ఎక్కడ చూసిన 'ఆర్ఆర్ఆర్' పేరే. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ అభిమానులు ఈ సినిమాను ఇప్పటికీ మైండ్‌లో నుండి తీసేయలేకపోతున్నారు. అందుకే మళ్లీ మళ్లీ థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడడానికి వెళ్తున్నారు. అందుకే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొడుతోంది. కేవలం ఇండియన్ సినిమా రికార్డులనే కాదు.. తాజాగా ఓ ఫేమస్ హాలివుడ్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్.

దేశవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 257.15 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు చూసి మూవీ టీమ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్ విడుదలయ్యి వారం రోజులు కావస్తుండగా ఇప్పటికే ఈ సినిమా రూ. 500 కోట్లు కలెక్ట్ చేసి రూ.700 కోట్ల మార్క్‌ను టచ్ చేయడానికి దగ్గరగా ఉంది.

ఆర్ఆర్ఆర్ విడుదలకు కొన్నిరోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది హాలీవుడ్ సినిమా 'బ్యాట్ మ్యాన్'. ఈ సినిమా విడుదలయిన నెల రోజుల్లోనే 600 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్‌ను టచ్ చేయగా.. నెల రోజులలోపు బ్యాట్ మ్యాన్ క్రియేట్ చేసిన రికార్డ్ బ్రేక్ ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన నెంబర్ 1 సినిమాగా నిలుస్తుంది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు అనుకుంటున్నారు అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story