RRR: ఎన్టీఆర్‌ని చూసి జపాన్ అభిమానులు ఆనందంతో..

RRR: ఎన్టీఆర్‌ని చూసి జపాన్ అభిమానులు ఆనందంతో..
RRR: సినిమా వారిపై ఎంత ప్రభావం చూపింది. దేశం కాని దేశంలో తెలుగు సినిమాకు ఎంతో ఆదరణ లభించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జపనీయుల అభిమానాన్ని చూరగొంది.

RRR: సినిమా వారిపై ఎంత ప్రభావం చూపింది. దేశం కాని దేశంలో తెలుగు సినిమాకు ఎంతో ఆదరణ లభించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జపనీయుల అభిమానాన్ని చూరగొంది.

జపాన్‌లోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నటుడిని కలుసుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో నెటిజన్లు అతడిని అసలైన హీరోగా అభివర్ణిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్‌లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో తన అభిమానులతో సంభాషించారు. అతని అభిమానులు చాలా మంది తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోయారు. అభిమానం ఎక్కడైనా ఒక్కటే అని చాటిచెప్పారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల సందర్భంగా జ‌పాన్‌లో ఉన్నారు. అతనితో పాటు నటుడు రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళితో సహా చిత్ర బృందం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం దేశ దేశాల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంటోంది.

RRR ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్, రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ తమ భార్యలతో కలిసి బుధవారం జపాన్ చేరుకున్నారు. ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో విడుదలైంది. RRR, 1920ల నాటి కల్పిత కథ. ఇద్దరు హీరోలు విప్లవకారులు - అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ల పాత్రలను అద్భుతంగా పోషించి అభిమానులను ఆకట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story