RRR Trailer : RRR ట్రైలర్ గూస్ బంప్స్ అంతే ..!

RRR Trailer : ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా ఎదురుచూస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ , మేకింగ్ వీడియోస్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచాయి. వీటికి తోడుగా ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది.
ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 'పాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న.. గర్వంతో గీ మన్నులో కలిసిపోతనే'అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ .. 'భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా'అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. డివివి దానయ్య దాదాపు నాలుగువందల కోట్ల ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివి ఉందట. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com