Raviteja : సంక్రాంతి నుంచి ఉగాదికి వెళ్లిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా ఫ్లాపులు చూస్తున్నాడు. అయినా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. అతను గ్యాప్ ఇవ్వడం లేదు కానీ.. తీసుకునేలా చేసింది ఒక ప్రమాదం. ప్రస్తుతం అతను తన కెరీర్ లో 75వ సినిమా చేస్తున్నాడు. మైల్ స్టోన్ లాంటి మూవీని మెమరబుల్ గా మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం చేస్తున్నాడు.
రవితేజ గత సంక్రాంతికి ఈగల్ సినిమా విడుదల చేయాలనుకున్నాడు.కానీ కుదర్లేదు. అంతా కలిసి పోస్ట్ పోన్ చేయించారు. దీంతో ఈ సారి ఎలాగైనా సంక్రాంతికి రావాలని ప్రయత్నించారు. బట్ ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగి గాయపడ్డాడు రవితేజ. దీంతో రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమైంది. ఈ కారణంగా సంక్రాంతికి రిలీజ్ చేయడం కుదరలేదు. అందుకే ఈ పండగ మిస్ అయినా సమ్మర్ బరిలో ఉగాదికి విడుదల చేస్తాం అని ప్రకటించారు. తెలుగు వారి కొత్త యేడాది ఉగాది ఈ సారి మార్చి 30న వస్తోంది. అంటే ఈ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తారన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com