Ruhani Sharma : గ్లామర్ డోస్ లో రుహానీ శర్మ

Ruhani Sharma : గ్లామర్ డోస్ లో రుహానీ శర్మ
X

చిలసౌ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ రుహానీ శర్మ ( Ruhani Sharma ). ఈ నార్త్ బ్యూటీ ఈ సినిమాలో తన నటనతో అభిమానులను కూడా సంపాదించుకుంది. అందంగా ఉండే ఈ ఆపిల్ భామలో యాక్టింగ్ టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావడం లేదు. రీసెంట్ గా ఈ బ్యూటీకి అన్నీ ఫ్లాపులే వచ్చాయి. దీంతో అందాల ప్రదర్శణకు ఏమాత్రం మొహమాటం చెప్పడం లేదట ఈ బ్యూటీ. ఇప్పటికే ఒకటి రెండు హిందీ సీరీస్లలో ముద్దు సీన్లు, ఇంటిమేట్ సన్నివేశాలలో నటించి కుర్రకారు మతులను పోగోట్టింది. ఆ స్థాయి గ్లామర్ను తెలుగులో ఏ సినిమాలో చేయలేదు ఈ ముద్దుగుమ్మ. మంచులా మెరిసే ఈ అందమైన బొమ్మకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న మూవీలో రుహానీ

శర్మకు చోటు దక్కిందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రీసెంట్గా గ్లామర్ డోస్ పెంచిన ఈ హీరోయిన్, కేవలం టాలీవుడ్ను నమ్ముకోకుండా ఓ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు ఓటీటీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి అల్లరి నరేశ్ సినిమాతోనైనా టాలీవుడ్లో ఈ ఆపిల్ పండుకు మరిన్ని అవకాశాలు వస్తాయోమో చూడాలి.

Tags

Next Story