Kiccha Sudeep : బిల్లా రంగా బాషా కోసం క్రేజీ హీరోయిన్ల వేట

కేజీఎఫ్ వచ్చిన దగ్గర నుంచి కన్నడ స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా హీరోలు అనిపించుకోవాలని అదే పనిగా ఆరాటపడుతున్నారు. అందులో ముందుగా కనిపించే స్టార్ సుదీప్. యశ్ లాంటి టైర్ 2 హీరో ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత తానెందుకు కాకూడదు అనుకున్నాడేమో అప్పటి నుంచి అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నాడ. బట్ ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. అయితే ఈ సారి తెలుగు ప్రొడ్యూసర్ మీదుగా ఆ లీగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. తెలుగులో హనుమాన్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణంలో ‘బిల్లా రంగా బాషా’అనే చిత్రం చేస్తున్నాడు సుదీప్. దీనికి ‘ఫస్ట్ బ్లడ్’ అనే క్యాప్షన్ ఉంది. అంటే సెకండ్ బ్లడ్ పేరుతో సీక్వెల్ గా ఉంటుందేమో. ఇక సుదీప్ తోనే ఇంతకు ముందు విక్రాంత్ రోణా వంటి మూవీ తీసిన అనూప్ భండారీ ఈ చిత్రానికి దర్శకుడు. మరి బిల్లా రంగా బాషాగా సుదీప్ త్రిపాత్రాభినం చేస్తున్నాడా లేక ముగ్గురు హీరోలు ఉంటారా అనేది ఇంకా చెప్పలేదు కానీ.. ఈ మూడు పాత్రల సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలనుకుంటున్నారు. అలా మేకర్స్ దృష్టిలో ఫస్ట్ ప్రియారిటీగా ఉన్న బ్యూటీస్ రుక్మిణి వసంత్, పూజాహెగ్డే.
రుక్మిణి కన్నడ అమ్మాయే. పూజా ఓకే అయితే ఇది తనకు ఫస్ట్ కన్నడ మూవీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరినీ బిల్లా రంగా బాషాలో తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా వీరు ఓకే చెప్పలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే హిందీతో పాటు తమిళ్ లో బిజీగా ఉంది. రుక్మిణి వసంత్ కు క్రేజ్ అయితే వచ్చింది కానీ.. ఆ రేంజ్ ఆఫర్స్ రావడం లేదు. పాపకు ప్యాన్ ఇండియాకు వెళ్లేంత రేంజ్ ఉంది. కానీ ఆఫర్స్ లేవు. అందుకే ఈ మూవీలో ఖచ్చితంగా ఓకే చెబుతుంది అనుకోవచ్చు. ఇక ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి పూజా కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com