Jai Bhim: జై భీమ్ బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ.. నిర్మాతగా కూడా సూర్య సక్సెస్..

Jai Bhim (tv5news.in)

Jai Bhim (tv5news.in)

Jai Bhim: సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

Jai Bhim: సూర్య సినిమాలంటే చాలామందికి ఇష్టం. సూర్యకు అభిమానులు కాకపోయినా తన సినిమాలను ఇష్టంగా చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సూర్య ఎప్పటికప్పుడు తనలోని నటుడిని మెరుగుపరచాలనే చూస్తారు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో, లుక్స్‌లో ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవడానికే సూర్య ప్రయత్నం. పైగా హీరోగానే కాదు నిర్మాత కూడా సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటున్నారు.

ఇటీవల సూర్య నటించిన 'జై భీమ్' సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నేరుగా ఓటీటీలో విడుదలయినా కూడా జై భీమ్ కేవలం మౌత్ టాక్‌ను బట్టి సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సూర్య మాత్రమే కాదు తనతో పోటీగా నటించిన లిజజోమోల్ జోస్, మణికందన్‌కు కూడా ప్రేక్షకులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. జై భీమ్ సినిమాలో సూర్య హీరో మాత్రమే కాకుండా నిర్మాత కూడా.

2డీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మించారు. అందులో మొదటి స్థానంలో ఉంటుంది జై భీమ్. అయితే జై భీమ్ బడ్జెట్ గురించి ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది. ఈ సినిమాను కేవలం 10 కోట్లు పెట్టి తెరకెక్కించారట సూర్య. ఆ తర్వాత ఓటీటీలో దీని విలువ 45 కోట్లకు పెరిగింది. అంటే దీని ద్వారా సూర్య 25 కోట్ల లాభం పొందినట్టు టాక్.

Tags

Next Story