Kalyani Priyadarshan: యంగ్ హీరోతో కళ్యాణి ప్రియదర్శన్ ప్రేమాయణం.. పెళ్లి కూడా అంటూ..

Kalyani Priyadarshan: ఈమధ్య సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు కామన్ అయిపోయాయి. అందులో కొన్ని పెళ్లి వరకు కూడా వెళ్తూ.. వారి అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. కానీ చాలావరకు అవి రూమర్స్ వరకే ఆగిపోతున్నాయి. ఒక హీరో, హీరోయిన్ సాన్నిహిత్యంగా ఉంటే.. ఇక వారిలో ప్రేమలో పడినట్టే అని కథనాలు వచ్చేస్తున్నాయి. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్‌పై కూడా అలాంటి కథనాలే వినిపిస్తున్నాయి.
సౌత్‌లో ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు ప్రియదర్శన్. ఆయన వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కళ్యాణి. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'హలో' చిత్రంతో డెబ్యూ చేసింది కళ్యాణి. మొదటి సినిమాలోనే తన క్యూట్ యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది ఈ భామ. కానీ దాని తర్వాత తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తాను మాలీవుడ్‌లోనే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది.
ఇటీవల కళ్యాణి హీరోయిన్‌గా నటించిన 'హృదయం' థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. పేరుకే మలయాళ చిత్రమైన హృదయంకు సౌత్ ప్రేక్షకులు అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరో ప్రణవ్ మోహన్‌లాల్‌తో కళ్యాణి ప్రేమలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది.
ఎన్నో ఏళ్లుగా మలయాళంలో సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు మోహన్‌లాల్. ఈ హీరో కుమారుడే ప్రణవ్ మోహన్‌లాల్. 2018లో హీరోగా పరిచయమయిన ప్రణవ్‌కు హృదయం చిత్రంతో గుర్తింపు లభిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సబయంలో తాను కళ్యాణితో ప్రేమలో పడ్డాడని, అందుకే వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉందని మాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ ప్రేమ ఇలాగే సాగితే పెళ్లి వరకు కూడా వెళ్లొచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com