Kubera Movie : హాట్ టాపిక్ గా కుబేర రన్ టైమ్

Kubera Movie :  హాట్ టాపిక్ గా కుబేర రన్ టైమ్
X

శేఖర్ కమ్ముల సినిమా అంటే చాలా సెన్సిబిలిటీస్ ఉంటాయి. టాలీవుడ్ లో మోస్ట్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ అంటే అతనే అని చెప్పాలి. అతని సెన్సిబిలిటీస్ ప్యాన్ ఇండియా స్థాయిలో కనిపించబోతున్నాయి. శేఖర్ లేటెస్ట్ మూవీ కుబేర ఈ నెల 20న విడుదల కాబోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేర ట్రాన్స్ కు తెలుగు, తమిళ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఓ కొత్త కోణంలో స్టార్ హీరోలను చూపించబోతున్నాడు శేఖర్ అనిపించిందా ట్రాన్స్ చూశాక. పైగా శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ స్టార్స్ తో వర్క్ చేస్తున్నాడు. అతని డైరెక్షన్ లో నటించిన వారే స్టార్స్ అయ్యారు తప్ప.. అతనెప్పుడూ స్టార్స్ తో వర్క్ చేయలేదు. కుబేర ఫస్ట్ మూవీ.

ఇక ఈ మూవీ రన్ టైమ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ల క్రితం వరకూ తెలుగు సినిమా అంటే రెండున్నర గంటలు. ఓ పది నిమిషాలు కాస్త అటూ ఇటూగా ఉండేది. కానీ అర్జున్ రెడ్డి తర్వాత నుంచి లెక్కలు మారాయి. మరోసారి బ్లాక్ వైట్ కాలం లాగా మూడు గంటల నిడివి ఉన్నా చూస్తున్నారు. కాకపోతే కంటెంట్ ఆ మూడు గంటలూ కూర్చోబెట్టగలిగితేనే వర్కవుట్ అవుతుంది. లేదంటే అదే పెద్ద మైనస్ అయిన సందర్భాలూ చూస్తున్నాం. మరి ఈ టైమ్ లో కుబేర రన్ టైమ్ కూడా మూడు గంటలకు పైనే ఫైనల్ గా తేల్చారు.

కుబేర మూవీ రన్ టైమ్ ను 3 గంటల 15 నిమిషాలకు లాక్ చేశారట. నిజానికి ఇది మూడున్నర గంటల పాటు వచ్చిందట. కానీ మరోసారి ఫైనల్ గా ఎడిటింగ్ చేసుకుని ఈ మూడు గంటల పదిహేను నిమిషాలను ఫైనల్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల సినిమాను అంత సేపు చూడటం అంటే ఖచ్చితంగా బలమైన ఎమోషన్స్ ను, అద్భుతమైన కంటెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో.

Tags

Next Story