Karthikeya: ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ నిశ్చితార్థం..

ఆర్‌ఎక్స్100 చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ ఆదివారం సాయింత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హా్ల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులతో పాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు నిశ్చితార్ధానికి హాజరై అభినందనలు తెలిపారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కార్తీకేయ మనువాడబోయే అమ్మాయికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
2017లో ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. కానీ తరువాత వచ్చిన 'ఆర్ఎక్స్ 100' ఘన విజయం సాధించి ఆయన సూపర్ హిట్ అందించింది. ప్రతి నాయకుడి పాత్రలోనూ మెప్పిస్తున్న కార్తికేయ నానీ హీరోగా నటించిన గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా నటించారు. మరో చిత్రం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'వలిమై'లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com