Dhanush : రాయన్ ఓటిటి డేట్ ఫిక్స్ అయింది

ధనుష్ 50వ సినిమాగా అతని డైరెక్షన్ లోనే వచ్చిన సినిమా రాయన్. కమర్షయల్ గానూ పెద్ద విజయం సాధించిందీ మూవీ. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా.. ధనుష్ తన క్యారెక్టర్ ను అండర్ ప్లే చేస్తూనే అదరగొట్టాడు అన్న ప్రశంసలు అందుకున్నాడు. ధనుష్ తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.జే సూర్య విలన్ గా ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో రాయన్ కు బ్యాక్ బోన్ గా నిలిచాడు.
థియేటర్ రన్ లో మాగ్జిమం ధనుష్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీని చూసేశారు. అయినా ఓటిటిలోనూ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా కాబట్టి ఆ ఆడియన్స్ కూడా ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. రాయన్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. సో.. 23 నుంచి ధనుష్ ఫ్యాన్స్ బుల్లితెరపై మళ్లీ సందడి చేస్తారన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com