Saakini Daakini Twitter Review: యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'శాకిని డాకిని'.. : ట్విట్టర్ రివ్యూ

Saakini Daakini Twitter Review: ప్రముఖ నటీమణులు నివేత థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ కామెడీ చిత్రం శాకిని డాకిని సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియన్ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో స్వామి రారా, దోచెయ్, కేశవ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
విడుదలయ్యే ప్రతి సినిమాని చూసేసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు కొందరు సినీ ప్రియులు.. అలా శాకిని డాకిని గురించి వాళ్ల అభిప్రాయం ఏంటో చూద్దాం.
ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీతో సమానంగా యాక్షన్ సన్నివేశాలను కూడా ఇద్దరు తారలు పోటీపడి నటించారు. షాలిని మరియు దామిని AKA సాకిని మరియు దాకిని పోలీస్ ట్రైనీలు, అక్కడే వారు స్నేహితులుగా మారతారు. డ్యూటీలో భాగంగా వారిద్దరూ ఘోరమైన నేరంలో చిక్కుకున్న ఓ అమ్మాయిని రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. అసలు నేరస్తులను పట్టుకునేందుకు, రాకెట్‌ను బద్దలు కొట్టేందుకు అన్నింటినీ పణంగా పెడతారు.
శాకిని డాకిని చిత్రానికి నిర్మాతలుగా డి సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్‌వూ థామస్ కిమ్‌లు వ్యవహరించారు. ఈ చిత్రానికి సంగీతం: మైకీ మెక్‌క్లెరీ మరియు సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్. విప్లవ్ నిషాదమ్ ఈ చిత్రానికి ఎడిట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com