Upasana Kamineni: నా వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంది.. కానీ పిల్లలు.. : సద్గురును అడిగిన ఉపాసన

Upasana Kamineni: పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడని, పెళ్లయితే పిల్లల్ని ఎప్పుడు కంటారని సాధారణ వ్యక్తులకే కాదు సెలబ్రిటీలకు తరచూ ఎదురయ్యే ప్రశ్నలు.. అభిమానులు తనని, రామ్ చరణ్ ని అడుగుతున్న ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలని ఆధ్యాత్మిక గురువు సద్గురుని అడిగింది ఉపాసన.
పెళ్లి చేసుకుని పదేళ్లవుతోంది.. చాలా సంతోషంగా ఉన్నాం. నేను నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఎంతో ప్రేమిస్తాను.. కానీ అందరూ నా లైఫ్ లోని ఆర్ఆర్ఆర్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.. మొదటి ఆర్.. నా రిలేషన్ షిప్ గురించి, రెండో ఆర్.. రీ ప్రొడ్యూస్ (పిల్లలను కనే సామర్థ్యం) గురించి, మూడో ఆర్.. లైఫ్ లో నా రోల్.. వీటి గురించే జనాలు ఎక్కువగా చర్చిస్తుంటారు అని చెప్పుకొచ్చింది.
ఉపాసన ప్రశ్నకు సద్గురు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. రిలేషన్ అనేది నీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీ ప్రొడ్యూస్.. పిల్లలు కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులిస్తాను.. ఈ తరం వాళ్లు పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా అధికమైపోయింది.
ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని.. ఎందుకంటే అవి అంతరించి పోతున్నాయి. కానీ మనం అంతరించడంలేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం అని సద్గురు బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న ఉపాసన.. మీరు ఇలా చెప్పారు కదా.. ఇక మీకు మా అమ్మ, అత్తయ్యగారి నుంచి ఫోన్లు వస్తాయని సరదాగా చమత్కరించింది.
దీంతో సద్గురు కూడా తనకు ఇలాంటి కాల్స్ అమ్మలు, అత్తల నుంచి ఎన్నో ఫోన్లు వస్తుంటాయని నవ్వేశారు. సద్గురు, ఉపాసనల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com