Dheekshith Shetty : ఆకట్టుకునేలా సఃకుటుంబానాం : హీరో దీక్షిత్ శెట్టి

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.
ఈ చిత్రాన్ని చూసిన హీరో దీక్షిత్ శెట్టి స్పందిస్తూ... "ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం సఃకుటుంబానాం. సినిమాలోని క్యారెక్టర్స్ ఇంకా అలాగే సినిమాలో కొన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సరికొత్తగా లేయర్స్ చూపించడం అనేది చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో హీరో రామ్ కిరణ్ నటన చూసి కొత్త వాడిలా అనిపించలేదు. తనలోని స్ఫూర్తిని ఎంత పెట్టి ఈ సినిమాలో నటించారు. ఒక కొత్త నటుడుకి మంచి కథ అలాగే టీం దొరకడం చాలా కష్టం కానీ ఇతనికి అలా దొరకడం చాలా అదృష్టం. భవిష్యత్తులో మరింత మంచి సినిమాలు తనకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమాలోని పాటలు, రామ్ కిరణ్ డాన్స్ అద్భుతంగా అనిపించాయి. సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బాగా అనిపించాయి. నిర్మాణం విలువలు బాగున్నాయి. తొలి చిత్రంలోని ఎందరో సీనియర్ నటులతో నటించడం రామ్ కిరణ్ కు మరొక వరం అనుకోవచ్చు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

