Sahakutumbanaam : జనవరి 1న విడుదల అవుతున్న సఃకుటుంబానాం

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం సఃకుటుంబానాం. నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర ఉన్న సందర్భంగా ఒకరోజు ముందుగానే కొన్ని కుటుంబాలకు ప్రీమియర్స్ వేయగా అద్భుతమైన స్పందన లభించింది. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేక్షకులతో థియేటర్ హౌస్ ఫుల్ కావడం విశేషం. ప్రేక్షకులంతా ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడవలసిందనీ, కుటుంబ విలువలు మరింత అందంగా, అర్థమయ్యే విధంగా ప్రేక్షకులకు చూపించడం వారికి ఎంతో సంతోషంగా అనిపించదని ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు తెలిపారు.
మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయి. న్యూ ఇయర్ సందర్భంగా 2026 జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 సంవత్సరంలో అందరి జీవితాలు మరింత వెలుగు పొందాలని ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ "సఃకుటుంబానాం" చిత్ర బృందం నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానందుని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

