Samantha: ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు: సామ్ కి హీరో స్పెషల్ విషెస్

Samantha: ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు: సామ్ కి హీరో స్పెషల్ విషెస్
Samantha: సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు తేజ్ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. జెస్సీ నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లి పోయింది మనసు.. వెరీ హ్యాపీ బర్త్ డే సామ్.

Samantha: స్టార్ హీరోయిన్ సమంతకు పలువురు సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. 2010లో ఏం మాయ చేశావో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మెగా హీరో సాయి థరమ్ తేజ్ ఆమెను స్పెషల్ గా విష్ చేశాడు. అందరికంటే ముందు అతడే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు ట్విట్టర్ వేదికగా సమంతకు. తన ఫేవరెట్ హీరోయిన్ సమంత అని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పిన సాయి థరమ్ ఆమె పుట్టిన రోజుని కూడా బాగా గుర్తు పెట్టుకున్నాడు.

సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు తేజ్ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. జెస్సీ నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లి పోయింది మనసు.. వెరీ హ్యాపీ బర్త్ డే సామ్.. ఇట్లు నీ వీరాభిమాని.. అని ట్వీట్ చేశాడు. ట్వీట్ తో పాటు సమంత స్వీట్ లుక్ తో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కూడా జత చేశాడు.

ప్రస్తుతం తేజ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్ వైరల్ అవుతోంది. సమంత నటించిన తమిళ చిత్రం ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులు ఆకట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం విడుదల కావలసి ఉంది. మరో ప్రాజెక్ట్ యశోద చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంది సమంత.



Tags

Next Story