Sai Dharam Tej: పవర్ స్టార్ మూవీ టైటిల్‌తో మెగా మేనల్లుడు..

Sai Dharam Tej: పవర్ స్టార్ మూవీ టైటిల్‌తో మెగా మేనల్లుడు..
X
Sai Dharam Tej: మెగా మేనల్లుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు సాయితేజ్.

Sai Dharam Tej: మెగా మేనల్లుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు సాయితేజ్. అతని కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్‌ మూవీ టైటిల్ పెట్టారు. మామూలుగా మెగా హీరోల టైటిల్స్ రిపీట్ అయినప్పుడు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి పవర్ స్టార్ స్టార్ టైటిల్ తో వస్తోన్న సాయితేజ్ ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడా..?


సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి పవన్ కళ్యాణ్‌ టైటిల్ ను పెట్టబోతుండటం విశేషం. అయితే ఇదేమీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌ చేసిన సినిమా టైటిల్ కాదు. చేయాలనుకున్న మూవీ టైటిల్. యస్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ .. క్రిష్‌ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.



అయితే ముందుగా ఈ చిత్రానికి అనుకున్న టైటిల్ విరూపాక్ష. కానీ మూవీ టీమ్ హరిహర టైటిల్ కే ఓటు వేశారు. దీంతో విరూపాక్ష టైటిల్‌ను పక్కన పెట్టేశారు. దాన్నే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ చిత్రానికి పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిత్రానికి హారర్ టచ్ ఇస్తూ.. మైథలాజికల్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందిస్తున్నారు. మరి ఈ మూవీ సాయితేజ్‌కి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

Tags

Next Story