Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ వాడిన బైక్ ఏంటి? ధర ఎంత?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జ్‌పై వెళుతున్న సాయి బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న అతడిని హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జుబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చికిత్స కొనసాగుతోందని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని అన్నారు. అభిమానులను ఆందోళన చెందవద్దని తెలిపారు.
ఇదిలా ఉంటే సాయి తేజ్ నడిపిన స్పోర్ట్స్ బైక్ ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.. 660 సీసీతో నడిచే ఈ ట్రంప్ బైక్ బరువు 228 వరకు ఉంటుంది. అనిల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్న బైక్ TS07 GJ1258 నెంబర్ ప్లేటును కలిగి ఉంది. ఇక ధర విషయానికి వస్తే రూ.11 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉంటుంది. సాయి తేజ్‌కి బైక్ రైడింగ్ అంటే ఇష్టం. అప్పుడప్పుడు విరామం దొరికితే తన బైక్ మీద కానీ, స్నేహితుల బైక్ కానీ తీసుకుని సరదాగా రైడింగ్‌కు వెళుతుంటాడు. శుక్రవారం కూడా అదేవిధంగా వెళుతున్న క్రమంలో బండి స్కిడ్ అయి ఊహించని ప్రమాదం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com