'విరూపాక్ష' ట్విట్టర్ రివ్యూ.. తేజ్ యాక్టింగ్ అదిరిందిగా..

విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ.. తేజ్ యాక్టింగ్ అదిరిందిగా..
X
శుక్రవారం థియేటర్లలో విడుదలైన 'విరూపాక్ష' ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.

శుక్రవారం థియేటర్లలో విడుదలైన 'విరూపాక్ష' ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ చిత్రం అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్‌ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా తీసిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్, ఝాన్సీ, కౌశిక్ మహత, రాజీవ్ కనకాల, రాజశేఖర్ అనింగి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, షామ్‌దత్ సైనుద్దీన్ కెమెరా వర్క్ , నవీన్ నూలి ఎడిట్ చేశారు.

ఈ సినిమాపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడి ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. నటీనటులు ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఎమోషనల్ సీన్స్ బాగా పండించారని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.

విజువల్స్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి ఒక్కటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసిన చిత్రంగా విరూపాక్షను అభివర్ణిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకుల అభిప్రాయాలు, చూసే దృక్కోణం మారుతోంది. వారి అభిరుచికి అనుగుణంగా తీసిన విరూపాక్ష కొత్త దర్శకుడి ప్రతిభకు అద్ధం పడుతోంది. ఈ సినిమా ద్వారా బలమైన సామాజిక సందేశాన్ని కూడా ఎత్తి చూపడం ప్రశంసనీయం అని అంటున్నారు. తొలి చిత్రం ద్వారా ముఖ్యమైన సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని తీసిన దర్శకుడి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. మొత్తమ్మీద, నెటిజన్లు ఈ చిత్రానికి సానుకూల స్పందనను అందించారు. ఈ సినిమా తప్పకుండా చూడమని మరొకరికి సిఫార్సు కూడా చేస్తున్నారు.

Tags

Next Story