Nikhil Sidhratha : నిఖిల్ సతిగా మేజర్ బ్యూటీ

Nikhil Sidhratha :  నిఖిల్ సతిగా మేజర్ బ్యూటీ
X

వరసగా భారీ మూవీస్ తో రాబోతున్నాడు నిఖిల్ సిద్దార్థ్. కార్తికేయ 2తో ప్యాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ఈ సారి వరుసగా స్వయంభు అనే ఫిక్షనల్, ది ఇండియా హౌస్ అనే హిస్టారికల్ మూవీస్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా ఎప్పుడో రూపొందిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో వచ్చాడు. బట్ ఈ మూవీ డిజాస్టర్ అయింది. అయినా అతను ఈ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదు. కాకపోతే స్వయంభూ, ది ఇండియా హౌస్ మూవీస్ డూ ప్యాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందుతుున్నవే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. వీటిలో ది ఇండియా హౌస్ అనే చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ మేజర్ ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది.

ఇవాళ(మంగళవారం) సాయీ మంజ్రేకర్ బర్త్ డే సందర్భంగా ది ఇండియా హౌస్ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తను ‘సతి’అనే పాత్రలో కనిపించబోతోందని చెప్పారు. సంప్రదాయబద్ధంగా చీరకట్టులో ఓరకంటితో చూస్తూ కనిపిస్తోన్న తన లుక్ బావుంది. కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే ఈమూవీలో చేస్తుందని టాక్. మరి సతి అంటే తను నిఖిల్ కు సతిగా నటిస్తోందా లేక సతీ సక్కుబాయి టైప్ పాత్రా అనేది తెలియాల్సి ఉంది. సాయీకి టాలెంటెడ్ అన్న పేరొచ్చింది కానీ బ్రేక్ రాలేదు. డెబ్యూ మూవీ గని పోయినా.. అడివి శేష్ మేజర్ మూవీలో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన స్కంద తన కెరీర్ కు ఎలాంటి హెల్ప్ అవలేదు. సో.. ఇప్పుడీ ది ఇండియా హౌస్ తో తెలుగులో తనకు ఆఫర్స్ వస్తాయనుకుంటోంది.

ఇక రామ్ వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కొన్నాళ్లుగా ఏ అప్డేట్ లేదు. దీంతో ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డౌట్స్ వచ్చాయి. బట్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ లోనే ఉందని అర్థం అవుతోంది.

Tags

Next Story