Sai Pallavi: ఆధ్యాత్మిక మార్గంలో సాయి పల్లవి.. సినిమాలకు దూరమవనుందా!!

Sai Pallavi: ఆధ్యాత్మిక మార్గంలో సాయి పల్లవి.. సినిమాలకు దూరమవనుందా!!
Sai Pallavi: శ్యామ్ సింగరాయ్ సినిమాలో రోజీగా నటించిన సాయి పల్లవి దక్షిణాదిలో చాలా మంది హృదయాలను గెలుచుకుంది.

Sai Pallavi: శ్యామ్ సింగరాయ్ సినిమాలో రోజీగా నటించిన సాయి పల్లవి దక్షిణాదిలో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. మలయాళం, తమిళం, తెలుగు పరిశ్రమలలో అత్యంత ప్రియమైన నటీమణిగా ప్రేక్షకాదరణ పొందింది సాయి పల్లవి. ఆమె చివరిసారిగా గార్గిలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటన అందరినీ ఆశ్చర్యపరిచింది.



అభిమానులు ఆమె తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతవరకు ఆమె నుండి ఏ అనౌన్స్‌మెంటూ లేదు. కొన్ని వారాల క్రితం, సాయి పల్లవి తన వైద్య వృత్తిపై దృష్టి సారించాలని, సినిమాలను విడిచిపెట్టాలని యోచిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కోయంబత్తూరులో తన సొంత ఆసుపత్రిని కూడా నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఆమె నటనకు స్వస్థి చెప్పి వైద్య వృత్తిని స్వీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం.


ఈ మధ్య, ఆధ్యాత్మిక వేషధారణలో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి హెతాయ్ హబ్బా వేడుకలను తన కుటుంబసభ్యులతో కలిసి జరుపుకుంది. ఆమె సంప్రదాయ బడగ వేషధారణలో ధరించిన దుస్తులు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాలను ఆమె సోదరి పూజా కన్నన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


సాయి పల్లవి తన ఆధ్యాత్మిక కోణాన్ని అన్వేషించడం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ఆమె నటనకు స్వస్తి చెబుతుందా? అనేది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. సాయి పల్లవి తరచుగా మతపరమైన ప్రదేశాలను సందర్శించి తన్మయత్వం చెందుతుంది. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.


కాగా, అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో సీతగా నటించడానికి సాయి పల్లవిని సంప్రదించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, శివ కార్తికేయన్ నటించిన కమల్ హాసన్ రాబోయే తమిళ చిత్రంలో కూడా కథానాయికగా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటన్నింటిపై సాయి పల్లవి టీమ్ స్పందించాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story