Sai pallavi : 'పుష్ప 2'లో ఆ పాత్ర కోసం సాయిపల్లవి..

Sai pallavi : పుష్ప 2లో ఆ పాత్ర కోసం సాయిపల్లవి..
X
Sai Pallavi : ‘పుష్ప 2’ షూటింగ్ ఇదే నెలలో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది

Sai Pallavi : 'పుష్ప 2' షూటింగ్ ఇదే నెలలో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. ఊహించిన దానికంటే పుష్ప మొదటి భాగం భారీ కలెక్షన్లు సాధించి నార్త్ ఆడియన్స్ మనసులను దోచేసింది. దీంతో స్ర్కిప్ట్‌పై దర్శకుడు సుకుమార్ మరింత కసరత్తు పెంచారు. తాజాగా నటి సాయిపల్లవి కూడా 'పుష్ప 2'లో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ గిరిజన మహిళ పాత్రకోసం సుకుమార్ సాయిపల్లవిని కలిసి చేయమని అడిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పుష్ప మేకర్స్, సాయిపల్లవి ఎలాంటి ప్రకటన చేయలేదు.

పుష్ప చిత్రం దక్షణ భారత్‌లోకన్నా నార్త్‌లో ఎక్కువ కలెక్షన్స్ చేసింది. ఇండియాలో స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ కలెక్షన్లను కూడా పుష్ప దాటివేసింది. సెకెండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీవల్లిని పుష్ప పెళ్లి చేసుకోవడం, భైరంగ్ సింగ్ షికావత్‌కు వార్నింగ్ ఇవ్వడంతో పార్ట్ 1 ముగుస్తుంది. ఇక పుష్ప తరువాత ఎలా తన సామ్రాజ్యాన్ని ఏలుతాడు, బైరంగ్ సింగ్ షికావత్ యాక్షన్ ప్లాన్స్ కోసం సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే.

Tags

Next Story