Sai Pallavi : సాయి పల్లవికి కోపం వచ్చింది

Sai Pallavi :  సాయి పల్లవికి కోపం వచ్చింది
X

ఎప్పుడూ కామ్ గా కనిపించే సాయి పల్లవికి కోపం వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరిపైనా అయినా రూమర్స్ సహజంగా కనిపిస్తాయి. సాయి పల్లవిపై ఇలాంటి రూమర్స్ కాస్త తక్కువే. అందుకు తను ఎంచుకునే పాత్రలు, తన ప్రవర్తన ఓ కారణం. అయితే తాజాగా తమిళ్ లో వికటన్అనే ఒక మాగజిన్ లో సాయి పల్లవి గురించి ఒక న్యూస్ వచ్చింది. అది చూడగానే అమ్మడికి ఆగ్రహం వచ్చింది. వెంటనే మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే లీగల్ గా వెళతాను అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది.

ఇంతకీ తనపై వచ్చిన రూమర్ ఏంటో తెలుసా.. తను నాన్ వెజిటేరియన్ అని. ఈ మాత్రానికే కోపం తెచ్చుకుంటారా అనుకుంటున్నారేమో.. ఎవరికి ఏ కారణంతో కోపం రావాలో ఎవరు చెబుతారు. కాకపోతే ఆ మేగజిన్ లో చెప్పిందేంటంటే.. 'సాయి పల్లవి నాన్ వెజిటేరియన్. కానీ ప్రస్తుతం రామాయణం మూవీ చేస్తోంది కాబట్టి ఆ మూవీ అయ్యే వరకూ కేవలం వెజ్ మాత్రమే తీసుకుంటోంది. ఇంకా నేలపైనే పడుకుంటుంది'.. ఇదే రాశారు. కాకపోతే విషయం ఏంటంటే.. సాయి పల్లవి ముందు నుంచీ ప్యూర్ వెజిటేరియన్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అలా ఏం లేదు. తను అసలు నాన్ వెజ్ తీసుకోదు. ఆ విషయం తెలుసుకోకుండా కేవలం సినిమా కోసం అలా ప్రవర్తిస్తోంది అని చెప్పడంతో కోపం వచ్చింది.

'దాదాపు ప్రతీసారి నాపై ఏ ఆధారం లేకుండా వార్తలు వచ్చిన ప్రతిసారీ మౌనంగానే ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే నిజమేంటో దేవుడికి తెలుసు. కానీ కొన్నాళ్లుగా ఇది కంటిన్యూస్ గా జరుగుతోంది. ఇక నేను స్పందించాల్సిన టైమ్ వచ్చింది. ముఖ్యంగా నా సినిమాల విడుదల, యాడ్స్, అలాగే నా కెరీర్ లో నేను హ్యాపీగా ఉన్న సందర్భాలలో. ఇకపై ఎలాంటి "ప్రముఖమైన" మీడియా/ వ్యక్తిని వార్తలు, గాసిప్ ల పేరుతో వార్తలు ప్రచురిస్తే ఖచ్చితంగా నానుండి లీగల్ యాక్షన్ కు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది'.

ఇదీ సాయి పల్లవి రియాక్షన్. ఏదేమైనా హీరోయిన్లు తమపై లేనిపోని రిలేషన్స్, ఎఫైర్లు అంటగడితే ఇలా రియాక్ట్ అవుతుంటారు. కానీ సాయి పల్లవి సింగిల్ పీస్ కదా. అందుకే నాన్ వెజ్ పీస్ ల గురించి మాట్లాడేసరికి కోపం పట్టలేకపోయింది. మరి సాయి పల్లవి కౌంటర్ ఆ మేగజిన్ వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story