సినిమా

Sai Pallavi: స్టేజ్‌పై సాయి పల్లవి కంటతడి.. అందుకేనంటూ క్లారిటీ ఇచ్చిన నాని..

Sai Pallavi: శ్యామ్ సింగరాయ్.. నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా చిత్రం.

Sai Pallavi: స్టేజ్‌పై సాయి పల్లవి కంటతడి.. అందుకేనంటూ క్లారిటీ ఇచ్చిన నాని..
X

Sai Pallavi: శ్యామ్ సింగరాయ్.. నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా చిత్రం. కొలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎక్కువశాతం కమర్షియల్ సినిమాల్లోనే కనిపించే నాని.. శ్యామ్ సింగరాయ్‌తో కొత్త ప్రయోగానికి నాంది పలకనున్నాడు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో సాయి పల్లవి స్టేజ్ మీదే ఎమోషనల్ అవ్వడం అందరినీ కదిలించింది.

సాయి పల్లవి తెలుగులో తన మొదటి సినిమాను చేసి, దానికి ప్రేక్షకుల దగ్గర నుండి విశేష స్పందన లభించినప్పుడు కూడా ఎప్పుడూ కంటతడి పెట్టుకోలేదు. కానీ శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మాట్లాడుతూ.. అందరికీ నటులుగా మారే అవకాశం రాదని, కానీ తనకు వచ్చిందని, దానికి తాను చాలా సంతోషిస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయిపోయింది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శ్యామ్ సింగరాయ్‌లోని ప్రణవలాయ అనే పాటను విడుదల చేశారు. అందులో సాయి పల్లవి నృత్యాన్ని చూడడానికి రెండు కళ్లు చాలట్లేవు. అయితే సాయి పల్లవి ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని.. అందుకే తాను ఇంతగా ఎమోషనల్ అవుతుందని నాని అన్నాడు. ఇప్పటికే తన డ్యాన్స్‌తో, యాక్టింగ్‌తో చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న సాయి పల్లవి.. మరోసారి తన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్‌తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES