Sai Pallavi: ఆ సీన్ గురించి అడిగినందుకు సాయి పల్లవి సీరియస్..

Sai Pallavi: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని ఇంతకు ముందు చేసిన సినిమాల్లో లేని డిఫరెంట్ ఎలిమెంట్ ఏదో శ్యామ్ సింగరాయ్‌లో కనిపిస్తుంది. అందుకే ఈ సినిమాపై అందరిలో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ మూవీ ట్రైలర్‌లోని ఓ సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంటర్ అయిన కృతి శెట్టి.. డెబ్యూలోనే తానేంటో అందరికీ చూపించింది. ఇక తన కెరీర్‌లో రెండో సినిమానే శ్యామ్ సింగరాయ్. రెండో సినిమాకే కృతి శెట్టి ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నందుకు సోషల్ మీడియాలో కృతి తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కుంటుంది. దీనిపై మూవీ టీమ్ ఏమీ స్పందించలేదు. కానీ ఇటీవల ఈ సీన్ గురించి అడిగినందుకు సాయి పల్లవి కాస్త ఘాటుగానే స్పందించింది.
నేచురల్ స్టార్ నానిని ఇలాంటి సీన్స్‌లో ఎప్పుడూ చూడలేదంటూ యాంకర్.. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని లిప్ లాక్ గురించి అడగుతూ ఎవరు ఆ సీన్‌లో ఎక్కువ కంఫర్టబుల్ ఉన్నారు అనగా.. దానికి సాయి పల్లవి 'ఒక కంఫర్టబుల్ జోన్‌లో ఉంటేనే అలాంటి సీన్స్ చేయగలరు. అయినా ఆ ట్రైలర్‌లో చూసింది కేవలం క్యారెక్టర్స్ మాత్రమే. అలాంటి ప్రశ్నను ఇలా అడగడం సరికాదంటూ' చెప్పేసింది. సాయి పల్లవి మాటకు నాని, కృతి శెట్టి అంగీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com