రివ్యూ

Gargi Review : కట్టుబాట్లు వివక్షల మధ్య.. న్యాయం కోసం గార్గి.. పాత్రలో ఒదిగిపోయిన సాయి పల్లవి

Gargi Movie Review : వుమెన్ ఓరియంటెడ్ మూవీ గార్గీతో సాయి పల్లవి మరోసారి సినిమా లవర్స్ మనసు దోచేసింది.

Gargi Review : కట్టుబాట్లు వివక్షల మధ్య.. న్యాయం కోసం గార్గి.. పాత్రలో ఒదిగిపోయిన సాయి పల్లవి
X

Gargi Movie Review : వుమెన్ ఓరియంటెడ్ మూవీ గార్గీతో సాయి పల్లవి మరోసారి సినిమా లవర్స్ మనసు దోచేసింది. తండ్రిని పోలీస్ కస్టడీని నుంచి విడిపించి న్యాయం చేసే కూతురి పాత్రలో సాయి పల్లవి నటించింది. గార్గి సినిమా చూసిన వారు సాయి పల్లవి కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా ఉంటుందని చెబుతున్నారు. ఆమె నటనకు నేషనల్ అవార్డు పక్కా అనే ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

డైరెక్టర్ గౌతమ్ రామచంద్ర గార్గి మూవీకి దర్శకత్వం వహించారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్ర్య లక్ష్మి థామస్ జార్జ్ కలిసి దీనిని నిర్మించారు. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చగా శ్రయంతి, ప్రేమక‌ృష్ణ అక్కట్టు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో జులై 15న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్స్ పై విడుదలైంది.

కథ : సమాజంలో స్త్రీకి కట్టుబాట్లు, వివక్ష, అనచివేత ఉంటాయి. అయితే వీటి మధ్య ఓ మిడిల్ క్లాస్ టీచర్ న్యాయం కోసం పోరాడే పాత్రలో సాయి పల్లవి గార్గిగా నటించింది. గార్గి (సాయిపల్లవి) ఓ టీచర్. ఆమె తండ్రి సెక్కురిటీ గార్డుగా పనిచేస్తాడు. అకస్మాత్తుగా పోలీసులు ఆమె తండ్రిని తీసుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. తాను ఒక్కతే తండ్రిని విడిపించేందుకు పోరాడుతుంది. సమస్యలను ఒంటరిగా ఎలా ఎదుర్కొంటుందన్నే సినిమా మెయిన్ కాన్సెప్ట్.

సినిమాలు ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులేస్తుంది సాయి పల్లవి. రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా కథ నచ్చితేనే చేస్తా అని సాయిపల్లవి అనేక సార్లు ప్రకటించింది. అన్నట్లుగానే సమాజంలో ఉన్న సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను సాయిపల్లవి ఎంచుకుంది. ఇలాంటి పాత్ర తనే చేయాలనేంతగా నటించి గార్గి కథకు న్యాయం చేసింది. గార్గి వన్ ఉమెన్ షో అని కొందరు ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా మంచి కథతో మరో హిట్ కొట్టింది సాయి పల్లవి.
Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES