కలిసొచ్చిన సెంటిమెంట్.. లవ్ స్టోరీలో రిపీట్..

కలిసొచ్చిన సెంటిమెంట్.. లవ్ స్టోరీలో రిపీట్..
ప్రతీ రంగంలో కొన్ని సెంటిమెంట్‌లను ఫాలో అవ్వడం సహజం. సినీ రంగంలో అలాంటి సెంటిమెంట్‌లు మరింత ఎక్కువగా ఉంటాయి.

ప్రతీ రంగంలో కొన్ని సెంటిమెంట్‌లను ఫాలో అవ్వడం సహజం. సినీ రంగంలో అలాంటి సెంటిమెంట్‌లు మరింత ఎక్కువగా ఉంటాయి.ప్రతీ రంగంలో కొన్ని సెంటిమెంట్‌లను ఫాలో అవ్వడం సహజం. సినీ రంగంలో అలాంటి సెంటిమెంట్‌లు మరింత ఎక్కువగా ఉంటాయి.ఒక సినిమా హిట్ అయ్యిందని దాని మొదటి అక్షరంతోనే తరువాతి సినిమాల టైటిల్స్‌ను పెట్టడం. ఒక హీరోయిన్‌తో బ్లాక్ బస్టర్ అందిందని తనతోనే మళ్లీ మళ్లీ సినిమాలు తీయడం.. లాంటివి మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే ఫిదా బ్యూటీ సాయి పల్లవికి కూడా అలాంటి ఒక సెంటిమెంట్ ఉందా?

తన ముందు సినిమాలను గమనిస్తే ఉందనే అనిపిస్తోంది. సాయి పల్లవికి పెళ్లి పాటలకు డ్యాన్స్ చేస్తే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉందనిపిస్తోంది. సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది. అందులో పెళ్లి సందర్భంగా వచ్చే 'వచ్చిండే' అనే పాటలో తన స్టెప్పులతో అందరినీ ఫిదా చేసింది. అసలు సాయి పల్లవి అంటే ఎవరు అని ప్రశ్నించేవారికి తాను ఒక మంచి నటి మాత్రమే కాదు డ్యాన్సర్ కూడా అని చెప్పుకునేలా చేసింది.

తన నటన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నా కూడా వచ్చిండే పాటలో తన డ్యాన్స్ మాత్రం సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. అలాగే మరోసారి అదే డైరెక్టర్‌తో చేస్తున్న లవ్‌స్టోరీ సినిమాలో కూడా అలాంటి ఒక పెళ్లి పాట ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి యూట్యూబ్‌లో కూడా ఎన్నో రికార్డులను దక్కించుకుంది. అదే సారంగదరియా. ఇందులో ఎప్పటిలాగానే సాయి పల్లవి తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ పెళ్లి పాటల సెంటిమెంట్ సాయి పల్లవి ఖాతాలో మరో హిట్‌ను జతచేసేలా ఉందని లవ్ స్టోరీకి అందుతున్న పాజిటివ్ రివ్యూలు చూస్తే తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story