Sai Pallavi : ముంబైలో బాన్సువాడ భానుమతి

Sai Pallavi : ముంబైలో బాన్సువాడ భానుమతి
X

బాన్సువాడ భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. అంటూ ప్రేక్షకులను ఫిదా చేసిన మళయాలీ ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఈ అమ్మడు ఇప్పుడు ముంబైలో ఉంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం సినిమాలో సీత పాత్ర లో సాయి పల్లవి నటిస్తున్న నేపథ్యంలో ముంబై అనగానే ఆ సినిమానే అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కానీ సాయిపల్లవి ముంబైలో ఉన్నది రామాయణం సినిమా కోసం కాదట. తమిళ సినిమా అమరన్ డబ్బింగ్ వర్క్ కోసం ముంబై వెళ్లినట్టు చెబుతోంది సాయిపల్లవి. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అమరన్ సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ నటిస్తుండగా, హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ మూవీని అక్టోబర్ 31, 2024 న భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల చివరి వరకు లేదా సెప్టెంబర్ లో సినిమా మొదటి కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

Tags

Next Story