సినిమా

Sai Pallavi: నన్నెవరూ అలా చూపించడం లేదు.. నేనేం చేయాలి..

Sai Pallavi: ఆరడుగుల హీరోతో అయినా అవలీలగా నటించేసి తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది..

Sai Pallavi: నన్నెవరూ అలా చూపించడం లేదు.. నేనేం చేయాలి..
X

Sai Pallavi: సాయి పల్లవి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తీగలా మెలికలు తిరిగే డాన్స్ మూమెంట్స్.. ఆరడుగుల హీరోతో అయినా అవలీలగా నటించేసి తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది.. అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేస్తుంది. తాజాగా రాణాతో కలిసి నటించిన విరాటపర్వం మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించారు. కామెడీ రోల్స్ చేయాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టింది. మరి ఈ మెరుపు తీగతో కామెడీ పండించాలంటే దర్శకులకు కొంచెం కష్టమైనా.. ఇచ్చి చూడండి ఇరిచేస్తాను అంటుందేమో సాయి పల్లవి..

ఓ నటికి ఢిఫరెంట్ రోల్స్ చేయాలనుకోవడంలో తప్పు లేదు.. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ముఖ్యం. ఓకే ముందు ముందు సాయి పల్లవి తనలో ఉన్న ఓ హ్యూమన్ యాంగిల్‌ని కూడా ప్రేక్షకులకు చూపించబోతుందేమో చూద్ధాం.

Next Story

RELATED STORIES