Sai Pallavi: అప్పటి నుంచే అనుకున్నా.. అలాంటి దుస్తులు వేసుకోకూడదని..: సాయి పల్లవి

Sai Pallavi: అప్పటి నుంచే అనుకున్నా.. అలాంటి దుస్తులు వేసుకోకూడదని..: సాయి పల్లవి
Sai Pallavi: ప్రేమమ్ తో ఎంట్రీ ఇచ్చి ఫిదాతో అందరి మనసులు దోచుకున్న సాయి పల్లవి పాత్రల విషయంలో ఆచి తూచి అడుగేస్తుంది.

Sai Pallavi: ప్రేమమ్ తో ఎంట్రీ ఇచ్చి ఫిదాతో అందరి మనసులు దోచుకున్న సాయి పల్లవి పాత్రల విషయంలో ఆచి తూచి అడుగేస్తుంది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే ఓకే చేస్తుంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఆమె సొంతం. నటనతో పాటు డ్యాన్స్ ఆమెకు ప్లస్ పాయింట్.

లవ్ స్టోరీ తరువాత వస్తున్న చిత్రం విరాట పర్వం. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు రానా.. రవన్న అనే విప్లవ నాయకుడిగా నటించారు. ఆమెది కూడా ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రానాతో స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జార్జియాలో మెడిసిన్ పూర్తి చేసిన ఆమె.. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ తనకెంతో సంతృప్తినిచ్చాయని, నటిగా తన కెరీర్ ముగిసింది అని భావించిన తరుణంలో సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్ వృత్తిని కొనసాగిస్తానని చెప్పింది.

అనంతరం తాను వేసుకునే దుస్తుల గురించి మాట్లాడుతూ.. మాది సాంప్రదాయ కుటుంబం.. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. నాకొక చెల్లి ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు టెన్నిస్, షెటిల్ ఆడడం కోసం సౌలభ్యంగా ఉంటుందని షార్ట్స్ ధరిస్తాను.. అయితే నటిగా మారిన తరువాత జరిగిన ఓ సంఘటన వల్ల సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసే దుస్తులు ధరించకూడదని ఫిక్సయ్యాను.

అందుకు కారణం డాక్టర్ కోర్సు చదువుతున్నప్పుడు జార్జియాలో ట్యాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ డ్యాన్స్ కి కాస్ట్యూమ్స్ సెపరేట్ గా ఉంటాయి. అమ్మా నాన్న అనుమతితోనే ఆ డ్యాన్స్ నేర్చుకున్నాను..

ఆ తరువాత ప్రేమమ్ లో నటించే అవకాశం వచ్చింది.. నా నటనకు ప్రశంసలు దక్కాయి.. అయితే అదే సమయంలో నేను చేసిన ట్యాంగో డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి.. అవి నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అని తెలిపింది.

రిమేక్స్ గురించి మాట్లాడుతూ.. ఇష్టమే కానీ సినిమా విడుదలయ్యాకు ప్రేక్షకులు తప్పకుండా ఒరిజినల్ పాత్రతో పోల్చి చూస్తారు.. ఆ భయంతోనే రిమేక్ చిత్రాల్లో నటించాలంటే భయం. అందుకే చిరంజీవి చిత్రం భోళాశంకర్ లో నటించే అవకాశం వచ్చినా వద్దనుకున్నాను.. ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా ముఠామేస్త్రి చిత్రంలో చిరంజీవి వేసిన స్టెప్పులు చూసి ఫిదా అయ్యాను. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం వస్తే చాలా అదృష్టంగా భావిస్తానని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story