Sai Pallavi : ఈ కాలపు మేటి నటి సాయి పల్లవి

తెలుగ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ హీరోయిన్లు అనగానే సావిత్రి, జమున, తర్వాత సౌందర్య పేర్లు వినిపిస్తాయి. ఈ తరంలో మాత్రం కీర్తి సురేష్ కంటే కాస్త ఎక్కువ పేరు వినిపించేది మాత్రం సాయి పల్లవిదే. యస్.. సాయి పల్లవి అంటే ది బెస్ట్ యాక్ట్రెస్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఆమె ఎంచుకునే కథలు, పాత్రలు, ఆ పాత్రల తాలూకూ గ్రేట్ నెస్ ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తాయి. మళయాలంలో చేసిన ప్రేమమ్ కంటే కాస్త ముందే జనాలకు తెలియని ఓ మూవీలో చిన్న పాత్ర, ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. బట్ ప్రేమమ్ తో ఓవర్ నైట్ టాప్ సెలబ్రిటీ అయింది. ఆపై తెలుగులో చేసిన ఫిదాతో తెలుగు ఆడియన్స్ ను కూడా ఇక్కడి ఫస్ట్ మూవీతోనే ఫిదా చేసింది. ఆ వెంటనే మిడిల్ క్లాస్ అబ్బాయితో హిట్ అందుకుంది. పడిపడి లేచె మనసుతో నటనతో మరోసారి కట్టి పడేసింది. తెలుగులోనూ వచ్చిన క్రేజ్ ను కోలీవుడ్ లోనూ తెచ్చుకుంది. మారి2తో అదరగొట్టింది. ఎన్.జి.కేలో నటనతో బాగా ఆకట్టుకుంది. పావ కథైగల్ తో మెప్పించింది.
ఇక మళ్లీ తెలుగులో లవ్ స్టోరీతో మరోసారి ఫిదా చేసింది. విరాట పర్వంలో నట విశ్వరూపం చూపించింది. తెలుగలో చివరగా తండేల్ తో మెరిసింది. రీసెంట్ గా ఏక్ దిన్ మూవీతో బాలీవుడ్ లోనూ డెబ్యూ ఇచ్చింది. బట్ ఈ మూవీ పోయింది. ప్రస్తుతం రామయాణ 1లో నటిస్తోంది. ఈ చిత్రం ఈ యేడాది దీపావళికి విడుదల కాబోతోంది. ఇవి కాక ధనుష్ తో పాటు మణిరత్నం డైరెక్షన్ లోనూ ఓ మూవీ చేస్తోంది. ఏదేమైనా ఈ కాలపు మహానటిగా మాత్రం సాయి పల్లవి వెలిగిపోతోంది. ఈ వెలుగులు కొనసాగాలని.. మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ఆకట్టుకోవాలని కోరుకుంటూ సాయి పల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
