Sai Pallavi: సినిమాలకు కమిట్ అవ్వని సాయి పల్లవి.. త్వరలోనే పెళ్లంటూ టాక్..

Sai Pallavi: టాలీవుడ్‌లో ఏ మాత్రం గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు సంబంధించిన పాత్రలు చేయకుండా.. కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సాయి పల్లవి. కేవలం తన నటన, నాట్యంతోనే ఎంతోమంది ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. అలాంటి సాయి పల్లవి గత కొంతకాలంగా ఏ కథలను ఓకే చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాయి పల్లవి నటించిన ప్రతీ సినిమా, తను కనిపించిన ప్రతీ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. అలా తన నటనతో ప్రేక్షకులపై ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సాయి పల్లవి. అయితే ప్రస్తుతం ఈ నటి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో తను త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. వీటిపై సాయి పల్లవి సన్నిహితులు ఓ క్లారిటీ ఇచ్చాడు.
లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాల్లో సాయి పల్లవి చేసిన పాత్రలు మరచిపోలేనివిగా నిలిచిపోయాయి. అయితే అదే రేంజ్‌లో ఓ కథ వచ్చేవరకు సినిమాలు చేయకూడదని సాయి పల్లవి నిర్ణయించుకున్నట్టు తన సన్నిహితులు చెప్తు్న్నారు. అంతే కానీ ఈ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వారు అంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయంపై ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com