Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.. నెక్ట్స్ సినిమా ఎవరితో..

Sai Pallavi: సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులను ఫస్ట్ మూవీతోనే ఫిదా చేసింది. సహజ సౌందర్యం, దానికి తగ్గట్లు అభినయం. తొలి సినిమాకే తనే డబ్బింగ్ కూడా చెప్పుకుని ఏకంగా తెలుగు అమ్మాయే అనిపించుకుంది. అంతకు ముందే మళయాల ప్రేక్షకులను తన నటనతో ప్రేమమ్ లో పడేసుకుంది. వీటికి తోడు తనో గొప్ప డ్యాన్సర్ కూడా. మరి ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయికి ఆఫర్స్ రాకుండా ఉంటాయా..? తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు వచ్చాయి.
తనకు నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెబుతూ.. నటనతోనూ డ్యాన్స్ లతో ఆకట్టుకుంటూ వెళుతోంది. ఇక తెలుగులో 2021లో చేసిన లవ్ స్టోరీతో పాటు ఈ యేడాది జూన్ లో వచ్చిన విరాటపర్వం చిత్రాల్లో తన నటనకు ఫిదా కానివారులేరు. విరాటపర్వంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా.. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాలేదు. తర్వాత నెలలోనే గార్గి వచ్చింది. ఇందులోనూ గొప్ప నటన చూపించింది.
ఆర్ట్ ఫిలిమ్ లా అనిపించినా.. సమాజానికి అవసరమైన కథగా మెప్పు పొందిందీ చిత్రం. ఇక గార్గీ తర్వాత తను మళ్లీ ఏ కొత్త సినిమాకూ సైన్ చేయలేదు. తెలుగులో ఆఫర్స్ లేవా అంటే అదేం లేదంటారు చాలామంది. దీంతో చాలామంది అసలు సాయి పల్లవికి ఏమైందీ.. ఎందుకు తెలుగులో సినిమాలు చేయడం లేదు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం హిందీకి వెళుతుందీ అన్నారు. కానీ అది రూమర్ గానే మిగిలిపోయింది.
ప్రస్తుతం తమిళ్ లో శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. అంతే తప్ప తెలుగులో మాత్రం ఇంకేం లేవు. తను మామూలుగా స్కిన్ షోకు, గ్లామర్ కు దూరంగా ఉంటోంది. ఆ కారణంగా టాలీవుడ్ పట్టించుకోవడం లేదా లేక తనకు నచ్చిన కథలు రావడం లేదా అనేది తెలియడం లేదు కానీ.. అసలు సాయి పల్లవి ఇంత నిశ్శబ్ధంగా ఎందుకు ఉంటోందనేది తెలియడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com