Sai Pallavi: మరోసారి ట్రెండింగ్‌లో సాయి పల్లవి.. ఫోటో వైరల్..

Sai Pallavi (tv5news.in)
Sai Pallavi: 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి తానేంటో నిరూపించుకుంది సాయి పల్లవి. యాక్టింగ్ మాత్రమే కాదు.. డ్యాన్స్‌లతో కూడా ప్రేక్షకులను మెప్పించే సాయి పల్లవి.. శ్యామ్ సింగరాయ్‌లో రోజీగా కనబరిచిన నటనతో మరో మెట్టు ఎక్కేసింది. అందుకే మరోసారి గూగుల్‌లో సాయి పల్లవి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాల్లోని ప్రొఫైల్ పిక్చర్ గురించి మరోసారి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్‌గా చేయాలంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అనే చాలా మూఢనమ్మకాలను సాయి పల్లవి ఎప్పుడో చెరిపేసింది. పైగా సినిమాల్లో నటించాలంటే కథ నచ్చడంతో పాటు తనకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా పెట్టుకుంది. అలాంటి సాయి పల్లవి పర్సనల్ విషయాలను కూడా ఎక్కువగా అందరితో పంచుకోదు. తన ఫ్యామిలీ గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువే.
సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండదు. ఒకవేళ తాను ఏదైనా పోస్ట్ చేసినా కూడా అది ఎక్కువశాతం తన సినిమా గురించే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తన ఫ్యామిలీతో గడిపిన సందర్భాలను ఫోటోలుగా తీసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా చిన్నప్పుడు తన తల్లితో దిగిన ఫోటోనే ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుంది సాయి పల్లవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com