Sai Pallavi: 30 దాటాకే మూడుముళ్లు.. అప్పటి వరకు..

Sai Pallavi: పెళ్లి పేరెత్తగానే అమ్మాయిలు సిగ్గుల మొగ్గలవుతారు బుగ్గలు ఎరుపెక్కేలా.. అందుకు మినహాయింపేం కాదు సినీ తారలు.. అయితే సాయి పల్లవి మాత్రం అప్పుడే ఏం పెళ్లండి నాకింకా 29 ఏళ్లే.. 30 వచ్చాక మూడు ముళ్ల బంధం గురించి ఆలోచిస్తానంటోంది.. అప్పటి వరకు తన ఫోకస్ అంతా సినిమాలపైనే అని ఈ హైబ్రిడ్ పిల్ల చెబుతోంది.
శ్యామ్‌సింగరాయ్ సక్సెస్ మీట్‌లో పెళ్లి గురించి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా సాయిపల్లవి పై వాఖ్యలు చేసింది. ఆఫర్ వచ్చిన ఏ సినిమాలో అయినా హీరో ఎవరూ అని చూడకుండా తన పాత్రకు 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి నటిస్తుంది..
ఆ సినిమాలోని తన పాత్ర గురించే ఆడియన్స్ మాట్లాడుకునేలా చేస్తుంది.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే సాయిపల్లవి తన నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాగా, రానాతో నటించిన విరాట పర్వం రిలీజ్ కావలసి ఉంది.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్‌హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సాయిపల్లవి తమిళంలో ఒక మూవీ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com