Sai Pallavi : సాయి పల్లవినే నమ్ముకున్న ఆమిర్ ఖాన్

Sai Pallavi :  సాయి పల్లవినే నమ్ముకున్న ఆమిర్ ఖాన్
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నాడు. అతని చివరి సినిమా లాల్ సింగ్ ఛద్దా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ తన కొడుకు జునైద్ ఖాన్ ను నిలబెట్టేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీదేవి చిన్న కూతరు ఖుషీ కపూర్ హీరోయిన్ గా అతన్ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన లవ్ యాపా అనే మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఈ సినిమా కోసం బాలీవుడ్ బిగ్గీస్ అందరి చేతా మాట సాయం తీసుకున్నాడు ఆమిర్ ఖాన్. బట్ ఉపయోగపడలేదు. దీంతో చివరికి తన కొడుకు హీరోగా నిలబడాలంటే సాయి పల్లవే కరెక్ట్ అనుకున్నాడు. అందుకే ఆమెతో ఓ సినిమా చేయిస్తున్నాడు.

యస్.. సాయి పల్లవి హిందీలో కేవలం రామాయణ మూవీలో మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసనా ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రం ఈ యేడాది చివర్లో విడుదలవుతుందట. సాయి పల్లవి ఓ సినిమాకు ఓకే చెప్పిందంటే కథ ఎంత బలంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అయినా తన నటన మాత్రం ఆకట్టుకుంటుంది. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందనుకోవచ్చు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ ఉండబోతోందట. మొత్తంగా తనయుడు హీరోగా నిలవాలంటే సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ బ్యూటీ కావాలని ఆమిర్ ఖాన్ కూడా అనుకున్నాడంటే అమ్మడి రేంజ్ ఎక్కడి వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

Tags

Next Story