Sai Pallavi: ఫ్యాన్స్‌కు సాయి పల్లవి స్వీట్ సర్‌ప్రైజ్.. బుర్కాలో వెళ్లి..

Sai Pallavi (tv5news.in)
Sai Pallavi: నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా పాజిటివ్ రివ్యూస్‌తో, మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకిృత్యాన్ మరోసారి విభిన్న కథలను హ్యాండిల్ చేయడంలో నిపుణుడని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా నాని, సాయి పల్లవి పర్ఫార్మెన్స్‌ను ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే సినిమా హిట్ టాక్ అందుకుంటున్న సందర్భంగా సాయి పల్లవి తన ఫ్యాన్స్‌కు సర్పైజ్ ఇచ్చింది.
ఫ్యాన్స్‌తో కలిసి తమ సినిమా చూడాలని చాలామంది నటీనటులకు ఉంటుంది. వారి సినిమా చూస్తున్నప్పుడు అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు. వారికి సినిమా ఎలా అనిపించింది అని నేరుగా తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే థియేటర్ విజిట్స్‌ను ప్లాన్ చేసుకుంటాయి మూవీ టీమ్స్. కానీ సాయి పల్లవి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది.
ముసాపేట్‌లోని శ్రీ రాములు థియేటర్‌లో సాయి పల్లవి, శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకిృత్యాన్‌తో పాటు సినిమా చూసింది. కానీ థియేటర్‌లో ఎవరికీ వీరు అక్కడే ఉన్నారన్న విషయం తెలీదు. ఎందుకంటే సాయి పల్లవి బుర్కాలో ఉంది. థియేటర్ నుండి బయటికి వచ్చిన తర్వాత బుర్కా తీసి తన ఫ్యాన్స్‌కు బై చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది సాయి పల్లవి. ఈ వీడియోను శ్యామ్ సింగరాయ్ టమ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.
Our @Sai_Pallavi92's Surprise Visit to Sri Ramulu Theatre for #ShyamSinghaRoy ✨
— Niharika Entertainment (@NiharikaEnt) December 29, 2021
▶️ https://t.co/zoDGQxZEZm#BlockBusterClassicSSR 🔥
Natural 🌟 @NameisNani @IamKrithiShetty @Rahul_Sankrityn @vboyanapalli @NiharikaEnt pic.twitter.com/jieWNGAK8x
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com