లవ్ స్టోరీతో మరోసారి ఫిదా చేసిన హైబ్రిడ్ పిల్ల..

లవ్ స్టోరీతో మరోసారి ఫిదా చేసిన హైబ్రిడ్ పిల్ల..
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకంటే మలయాళ ముద్దుగుమ్మలే ఎక్కువ. తెలుగు ప్రేక్షకులు కూడా వారిని బాగానే ఆదరిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకంటే మలయాళ ముద్దుగుమ్మలే ఎక్కువ. తెలుగు ప్రేక్షకులు కూడా అక్కడ నుండి వచ్చినవారిని బాగానే ఆదరిస్తున్నారు. అందులో ఒకరు సాయి పల్లవి. తాను మలయాళి కాకపోయినా తనను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం మాలీవుడే. అక్కడి ప్రేక్షకులను మలర్ పాత్రతో మెప్పించిన సాయి పల్లవి ఫిదా అంటూ తెలుగువారి ముందుకు కూడా వచ్చి అందరినీ నిజంగానే ఫిదా చేసింది.

మేకప్ అంటే ఇష్టపడని హీరోయిన్లు చాలా అరుదు. అలాంటి ఒక హీరోయినే సాయి పల్లవి. మలర్ లాంటి క్యారెక్టర్‌తో మెప్పించిన సాయి పల్లవిని చూసి శేఖర్ కమ్ముల తాను రాసుకున్న భానుమతి పాత్రకు ఆ అమ్మాయి ఎలా సెట్ అవుతుందని అనుకున్నాడో తెలియదు. కానీ అది సాయి పల్లవి సినీ కెరీర్‌నే మలుపు తిప్పింది. తెలుగులో భానుమతి లాంటి రఫ్ అండ్ టఫ్ పాత్రతో డెబ్యూ చేయడం ఒక ఎత్తైతే, ఆ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని అందరినీ మెప్పించడం మరో ఎత్తు.

ఫిదా తర్వాత కూడా సాయి పల్లవి పలు తెలుగు సినిమాల్లో నటించినా కూడా తన డెబ్యూ సినిమాకు వచ్చినంత గుర్తింపు మరే చిత్రం తనకు అందించలేకపోయింది. సాయి పల్లవి నటనను ఇష్టపడ్డ శేఖర్ కమ్ముల కూడా లవ్ స్టోరీలో మరో హీరోయిన్‌ను ఊహించుకోలేకపోయాడు. అందుకే వీరిద్దరు లవ్ స్టోరీ కోసం మరోసారి చేతులు కలిపారు.

ట్రైలర్, పాటలు చూసిన తర్వాత ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పోలికలు ఉన్నాయని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా అవన్నీ అబద్ధమని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎంతైనా సాయి పల్లవి నటన, డ్యాన్స్ ఎలాంటి వారినైనా కట్టిపడేయాల్సిందే. నెమలి లాంటి నాట్యంతో ఆకట్టుకునే సాయి పల్లవి మరోసారి లవ్ స్టోరీ చిత్రంలో తన డ్యాన్స్‌తో మ్యాజిక్ చేసింది.

Tags

Next Story