Sai Pallavi : సాయి పల్లవి సింగిల్ పీస్.. ఒక్కతే పిల్ల రెండు అవార్డులు

నేచురల్ యాక్ట్రెస్ గా ఈ కాలంలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ సాయి పల్లవి ( Sai Pallavi ). ఎంచుకునే కథల నుంచే తన స్పెషాలిటీ చూపిస్తుంది. మంచి డ్యాన్సర్ కూడా అయిన ఈ డాక్టర్ పిల్ల ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసింది. ఆ తర్వాత తెలుగులో ఫిదాతో శేఖర్ కమ్ముల పరిచయం చేశాడు. ఈ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్, నటన చూసి ఫిదా కాని వారు లేరు. అటుపై తెలుగులోనే పాగా వేసే ప్రయత్నం చేసింది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూనే నటనకే ప్రాధాన్యతనిస్తూ దూసుకుపోతోన్న సాయి పల్లవి కెరీర్ లో ఓ రేర్ రికార్డ్ యాడ్ అయింది.
ఒకే యేడాది రెండు భాషల్లో చేసిన రెండు సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ గా ఒకేసారి రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఈ ఫీట్ సాధించిన అరుదైన హీరోయిన్ తనే అని చెప్పాలి. గార్గిలో తన నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. తన తండ్రిపై పడిన ఒక దారుణమైన అపవాదును చెరిపే ప్రయత్నం చేసే అమ్మాయిగా తర్వాత తన తండ్రే అంత పెద్ద దారుణం చేసిన నేరస్తుడు అని తెలిసిన తర్వాత వేదన పడే అమ్మాయిగా అద్భుతమైన నటన చూపించింది.
ఇక విరాటపర్వంలో ఒక నక్సలైట్ నాయకుడిని అభిమానించి అతని కోసం అడవులకూ వెళ్లి నక్సలైట్ గా మారి చివరికి అతని చేతిలోనే హతమైన వెన్నెల అనే అమ్మాయి పాత్రలో తనకే సొంతమైన డిఫరెంట్ వేరియేషన్స్ ను గొప్పగా చూపించింది. ఈ రెండు సినిమాలకు సంబంధించి గార్గికి బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళ్ నుంచి విరాటపర్వంకు తెలుగు నుంచి క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. విశేషం ఏంటంటే హీరోయిన గా సాయి పల్లవి ఇప్పటి వరకూ చేసింది 15 సినిమాలే. ఇందులోనే 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఇంత తక్కువ టైమ్ లో ఆ ఫీట్ సాధించిన ఓన్లీ హీరోయిన్ కూడా సాయి పల్లవే. మరి ఈ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ఈ నేచురల్ బ్యూటీకి టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ నుంచి అభినందనలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com