రాజూ ఆత్మహత్య.. దేవుడు ఉన్నాడు: చిరంజీవి మనోజ్ స్పందన

రాజూ ఆత్మహత్య.. దేవుడు ఉన్నాడు: చిరంజీవి మనోజ్ స్పందన
వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లండకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. నిందితుడు స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నష్కల్ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు, చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజు అని నిర్ధారించారు. కాగా, రాజు ఆత్మహత్య చేసుకున్నవార్త విని సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పాపకు న్యాయం జరిగిందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు తనకు తానే శిక్ష విధించుకోవడం బాధిత కుటుంబానికి కొంత ఊరటనిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి ఘటనలకు పునారావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి అని చిరంజీవి ట్వీట్ చేశారు.

రాజు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించగా.. మంచు మనోజ్ రీ ట్వీట్చేస్తూ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్.. దేవుడు ఉన్నాడు అని పేర్కొన్నారు.

రాజూ ఆత్మహత్య.. దేవుడు ఉన్నాడు: చిరు, మనోజ్ స్పందనకోర్టు నుంచి, చట్టాల నుంచి నిందితులు తప్పించుకోవచ్చేమో కానీ, దేవుడు వేసే శిక్షల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. ఆ నరరూప రాక్షసుడికి దైవం సరైన శిక్ష విధించింది. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్ధాం అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story