Saiee Manjrekar: ప్రముఖ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిన వరుణ్ తేజ్ హీరోయిన్..

Saiee Manjrekar (tv5news.in)
Saiee Manjrekar: ఈ మధ్యకాలంలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చాలావరకు హీరోలు, హీరోయిన్లపై రిలేషన్‌షిప్‌పై రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అవి నిజమా, కాదా అని తెలుసుకోకుండా నెటిజన్లు కూడా ఈ కథనాలు వైరల్ చేసేస్తున్నారు. ముఖ్యంగా బీ టౌన్‌లో యంగ్ హీరో, హీరోయిన్ల డేటింగ్ రూమర్స్‌పై రోజుకో కొత్త కథనం పుట్టుకొస్తుంది. తాజాగా మరో బాలీవుడ్ జంట ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ముందుగా బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్ సరసన డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. వెంటనే తెలుగులో కూడా అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'గని'తో పాటు అడవి శేష్ 'మేజర్'లో కూడా సయినే హీరోయిన్.
ప్రస్తుతం సయి మంజ్రేకర్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో ప్రేమలో ఉన్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరి రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే వీరి ప్రేమకు కూడా వారి నుండి ఎలాంటి అడ్డులేదని టాక్. అయితే త్వరలోనే సుభాన్ డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com