Saif Ali Khan First Look in Devara : సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్.. యాక్షన్ లుక్ లో భైర

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్-ప్యాక్డ్ డ్రామా 'దేవర'లో తన తదుపరి పాత్రకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ ప్రధాన మహిళా పాత్రలో నటించడంతో పాటు తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకమైన విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఆగస్టు 16న సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అభిమానులకు ఓ సర్ఫ్రైజ్ ఇచ్చారు. 'దేవర'లోని ఆయన లుక్ ను రివీల్ చేశారు. సైఫ్ అలీఖాన్ 'దేవర'లో 'భైర' పాత్రలో కనిపించనున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
అభిమానులు ముందు నుంచి అంచనా వేసినట్టుగానే కొరటాల తన సృజనాత్మక దృష్టితో 'దేవర'లో సైఫ్ రూపాన్ని పునర్నిర్మించారు. అంతకుముందే 'దేవర' నుంచి ఓ అప్ డేట్ రివీల్ అవుతుందని హింట్ ఇచ్చిన మేకర్స్.. దాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే మధ్యాహ్నం 2 గంటలకు చిత్ర యూనిట్ ఓ కొత్త అప్ డేట్ ను ఇచ్చింది. సైఫ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ నందమూరి అభిమాలను ఖుషీ చేశారు. ఈ పోస్టర్ లో సైఫ్ విలనిజం లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన పోస్టర్ కు కింది భాగంలో బోట్ సన్నివేశాలతో కూడిన ఇమేజ్ లతో మొత్త లుక్ ను రివీల్ చేశారు. ఇక ఈ సినిమాలో సైఫ్ 'భైర' అనే పాత్రను పోషించనున్నట్టు కూడా దర్శకనిర్మాతలు వెల్లడించారు.
ఇక ముందే ఈ సినిమాపై అప్ డేట్ ఇస్తామని చెప్పడంతో ఈ రోజు సైఫ్ బర్త్ డే కాబట్టి.. ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేసే అవకాశం ఉందని చాలా మంది భావించారు. అనుకున్నట్టుగానే చిత్ర నిర్వాహకులు ఆయన లుక్ ను విడుదల చేశారు. ఇకపోతే తాజా అప్ డేట్ తో నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఇన్ని రోజులకు తారక్ సినిమా నుంచి ఓ వార్త రివీల్ అయిందని సంబరపడిపోతున్నారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లోకి బాలీవుడ్ నటులను తీసుకురావడం కామన్ అయిపోయింది. అదే తరహాలో సైఫ్.. ఇటీవలే 'ఆదిపురుష్' లో రావణాసురుడి పాత్రలో కనిపించారు. కానీ ఈ పాత్రకు ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సినిమాలోని క్యారెక్టర్ ఆయన ఫ్యాన్స్ ను భారీగానే నిరాశ పర్చింది. ఇక ఇప్పుడు తారక్ సినిమా దేవరతో మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైఫ్ కు ఈ సినిమా ఎలాంటి ఆదరణ, పాపులారిటీని తెస్తుందో చూడాలి మరి.
BHAIRA
— Jr NTR (@tarak9999) August 16, 2023
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com