Saif Alikhan : దేవర నుంచి భైరా వచ్చాడు

Saif Alikhan :   దేవర నుంచి భైరా వచ్చాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా దేవర. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న మూవీ ఇది. ఇవాళ ( శుక్రవారం ) సైఫ్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి అతనికి సంబంధించిన ఒక వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. 52 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ మొత్తం సైఫ్ కనిపిస్తున్నాడు. దేవరలో అతని పాత్ర పేరు భైరా. ఒక కుస్తీపోటీలో తనను ఎదురించడానికి వచ్చిన అందరినీ అంతం చేసే వీడియోతో పాటు చివర్లో పరుగెత్తుకుంటూ వచ్చి తన కత్తిని అందుకున్న షాట్ ఒకటి ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్ లోనే ‘ హిజ్ హంట్ విల్ బి లెజెండరీ ’ అనే లైన్ ఆ క్యారెక్టర్ కెపాసిటీని చెబుతోంది. అలాగే గ్లింప్స్ మొదట్లోనే రకరకాల ఆయుధాలతో కూడిన వాహనం ఊరేగింపుగా వచ్చే షాట్ చూస్తే దేవరలో ఎంత రక్తపాతం ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ మొత్తం గ్లింప్స్ లో అతి పెద్ద మైనస్ అనిపించింది మాత్రం అనిరుధ్ నేపథ్య సంగీతం. చాలా అంటే చాలా డల్ గా ఉంది. ఒకవేళ విలన్ కు ఎప్పుడూ లౌడ్ మ్యూజిక్కే ఉండాలా అనే కాన్సెప్ట్ కు భిన్నంగా ఇలా ప్లాన్ చేశారేమో కానీ.. ఇలాంటి రూత్ లెస్ మాస్ మూవీస్ లో లౌడ్ మ్యూజికే హైలెట్ అవుతుంది.

మొత్తంగా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. వాటిని అందుకుంటేనే ఎన్టీఆర్ కూడా ప్యాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడు.

Tags

Next Story